మేడ్చల్ జోన్, సెప్టెంబర్ 17 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి దుస్తు లు పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ అహ్మద్ సఫియుల్లా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


తరలిన బంజారాలు..

నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా భవన్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో పోచారం మున్సిపాలిటీ నుంచి బంజారాలు భారీ ఎత్తున తరలివెళ్లారు. చైర్మన్ బి.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో దాదాపు మూడు వందల మంది మహిళలు, యువకులు బయలుదేరి వెళ్లారు. వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, కమిషనర్ సురేశ్, పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, బంజారా ప్రతినిధులు పాల్గొన్నారు. -ఘట్కేసర్,సెప్టెంబర్17