కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 2 : కొకైన్ సరఫరాకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం…గోవాకు చెందిన వలవేలకర్ రోహిత్(31) రెండు రోజుల కిందట కొకైన్ తీసుకొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసేందుకు వచ్చాడు. సాయం చేసేందుకు జూబ్లీహిల్స్‌లోని ప్రణయ్నివాస్ ప్రాంతానికి చెందిన కృష్ణమౌర్య(24) అతడిని కలిశాడు. వీరిద్దరూ కొకైన్ సరఫరా చేసేందుకు మంగళవారం సుచిత్ర ప్రాంతానికి రావడంతో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 13గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.