దేశీ బోగీలు పట్టాలెక్కేదెప్పుడు?
హైదరాబాద్ మెట్రో రైలులో రద్దీకి శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ కాలయాపనలో కొట్టుమిట్టాడుతోంది. కొత్తగా 60 స్వదేశీ బోగీలను కొనుగోలు చేసి, వాటితో మెట్రో సేవలు విస్తరించాలనే ప్రతిపాదన రెండున్నరేళ్లు గడిచినా కొలిక్కి రావడం లేదు. ఓవైపు దేశీయ దిగ్గజ సంస్థల పోటీ, మరోవైపు భారీ నిధుల సర్దుబాటు అంశాల మధ్య ఈ ప్రాజెక్టు అమలుల్లోకి వస్తుందా లేదా అనే చర్చ మొదలైంది.
- రెండున్నరేళ్లుగా కొలిక్కిరాని మెట్రో బోగీల తయారీ
- కోచ్‌ల తయారీ పోటీలో భారత్ ఎర్త్ మూవర్ సంస్థ
- బడ్జెట్ సర్దుబాటుపై తొలగని ప్రతిష్టంభన
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలులో రద్దీకి శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ కాలయాపనలో కొట్టుమిట్టాడుతోంది. కొత్తగా 60 స్వదేశీ బోగీలను కొనుగోలు చేసి, వాటితో మెట్రో సేవలు విస్తరించాలనే ప్రతిపాదన రెండున్నరేళ్లు గడిచినా కొలిక్కి రావడం లేదు. ఓవైపు దేశీయ దిగ్గజ సంస్థల పోటీ, మరోవైపు భారీ నిధుల సర్దుబాటు అంశాల మధ్య ఈ ప్రాజెక్టు అమలుల్లోకి వస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ లో భాగంగా తిరుగుతున్న రైళ్లన్నీ ఇంతకాలం దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ కంపెనీకి చెందినవే. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రతి రైలుకు అదనంగా మరో కోచ్‌ను చేర్చి 3 బోగీల నుంచి 4 బోగీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.1, 200 కోట్లతో 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే మెట్రో నిర్వహణ సంస్థ సన్నాహాలతోపాటు, ప్రతిపాదనలు సర్కార్‌కు అందజేసింది.
కోచ్‌ల తయారీకి ప్రముఖ సంస్థల పోటీ..
స్వదేశీ పరిజ్ఞానంతో కోచ్‌లను తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలు పోటీపడుతున్నాయి. ముఖ్య ంగా మెట్రో రైల్వే రంగంలో విశేష అనుభవమున్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కు ఈ తయారీ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా మెట్రోలకు కోచ్‌లు అందించిన ట్రాక్ రికార్డ్ బీఈఎంఎల్ సొంతం కాగా, ఈ కొనుగోలు ప్రక్రియకు సాంకేతిక కన్సల్టెన్సీగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)ని భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. బెంగళూరులోని ఆల్ స్టామ్ , కోల్‌కతాలోని టైటాగఢ్ , చెన్నైలోని ఐసీఎఫ్ వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ బీఈఎంఎల్ వైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం.
బడ్జెట్ సర్దుబాటుపై తొలగని ప్రతిష్టంభన..
ఒకో మెట్రో కోచ్ తయారీకి సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ లెకన మొత్తం 60 బోగీలకు దాదాపు రూ.1,200 కోట్లు అవసరమవుతాయి. ఈ భారీ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలనేది ఇప్పుడు అసలు సమస్య నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, హామీ ఇచ్చినప్పటికీ, చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సర్దుబాటు చేసుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఇలాంటి సమయంలో మెట్రో కోచ్‌ల కోసం ఏకకాలంలో రూ.1,200 కోట్లను సర్దుబాటు చేయడం ఆర్థికంగా సవాల్ అని చెబుతున్నారు. ఈ భారీ వ్యయానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ పని మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొని ఉంది. బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతోనే టెండర్లు, అధికారిక ఒప్పందాల ప్రక్రియలో కొంత ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఏడాది తర్వాతే పట్టాలెక్కే అవకాశం
ప్రస్తుతం మూడు కారిడార్లలో రోజుకు 1,200 ట్రిప్పుల ద్వారా దాదాపు 4.6 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ వేళల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెకించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ ) ఆటోమేటిక్ సిస్టమ్‌కు అనుగుణంగానే కొత్త కోచ్‌లను రూపొందించాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు భావిస్తున్నారు. ఆర్థికపరమైన నిధుల సర్దుబాటులో ఆటంకాలు తొలగితే గానీ, బీఈఎంఎల్‌తో ఒప్పందం ఖరారు అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే.. తక్కువలో తక్కువ ఏడాది సమయం తర్వాతే దేశీ బోగీలు హైదరాబాద్ మెట్రో పట్టాలపై పరుగులు పెట్టే అవకాశం కన్పిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

