హైదరాబాద్, జూలై 23 : భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం హైదరాబాద్ స్థానిక వాతావరణం తదుపరి 24 గంటలు ఇలా ఉంటుంది.
– ఆకాశం మేఘావృతమై ఉంటుంది
– తేలికపాటి నుండి మితమైన వర్షం/ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం
– సాయంత్రం/రాత్రి నాటికి ఈదురుగాలులతో (30–40 కి.మీ.) తీవ్రమైన వర్షాలు
– ఉదయం పొగమంచు పరిస్థితులు
– గాలులు : పశ్చిమ దిశలో గంటకు 08–10 కి.మీ.
– ఉష్ణోగ్రతలు : గరిష్టం- 29°C | కనిష్టం- 23°C
– అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ 040-21111111 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఇంట్లో ఉండండి. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి అని నగర పౌరులకు సూచించింది.