 
                                                            సికింద్రాబాద్ బోయినపల్లిలో బుధవారం మద్యం లోడుతో వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. సుమారు రూ.3 లక్షల విలువైన మద్యం సీపాలు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వాహనం అలా బోల్తా కొట్టిందో లేదో.. మద్యం ప్రియులు ఎగపడ్డారు. బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు.
 
                            