కొండాపూర్, మే 3 : సీసీ కెమెరాల ఏర్పాటుతో పరిసరాలు అనుక్షణం పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట వేణుగోపాల స్వామి ఆలయంలో చందానగర్ యువజన నాయకుడు దొంతి కార్తిక్గౌడ్ ఆధ్వర్యంలో దొంతి సత్యనారాయణ గౌడ్ ఏర్పాటు చేసిన 42 సీసీ కెమెరాలను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. శాంతి, భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. ఎన్నో కేసులు సీసీ కెమెరాల సహాయంతో చేధించినట్లు తెలిపారు. అన్ని కాలనీలు, బస్తీల అసోసియేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా ఎమ్మెల్యే నిధులు (సీడీపీ) ద్వారా రూ. కోటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, చందానగర్ సబ్ఇన్స్పెక్టర్లు శ్రీధర్, వెంకటేశ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు వీరేశంగౌడ్, రవీందర్రెడ్డి, నాగేంద్ర, వరలక్ష్మి, సునీత, కృష్ణదాస్, తదితరులు పాల్గొన్నారు.