గోల్నాక, మే 3: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని అంబర్‌పేట నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మంగళవారం పండుగ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ ఈద్గా మైదానంలో వేలాది మంది ముస్లింలు హాజరై ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీ రెడ్డి, టీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డితో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఈద్గా మైదానంలో ముస్లింకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంబర్‌పేట ఈద్గా మైదానానికి ప్రత్యేక ప్రార్థనలకోసం వేలాదిగా తరలివచ్చిన ముస్లింలకు అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పి.సుధాకర్ నేతృత్వంలో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.