ఎల్బీనగర్/మలక్‌పేట జోన్ బృందం మే 3: సరూర్‌నగర్ ఈద్గా మైదానం వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను పలు పార్టీల నాయకులు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, యువ నాయకుడు పి.కార్తిక్‌రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కందికంటి శ్రీధర్‌గౌడ్, కందికంటి ప్రేంనాథ్గౌడ్, మహేందర్ యాదవ్, దరిపల్లి అశోక్, బేర బాలకిషన్, లోకసాని కొండల్‌రెడ్డి, మజీద్ కమిటీ ప్రతినిధులు షాజిద్, షౌకత్, షబ్బీర్, అజీం, సర్వర్, ఖాజా, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వనస్థలిపురంలో టీఆర్ఎస్ నాయకుడు నవీద్ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఖైసర్, జైపాల్‌రెడ్డి, ముబిన్ తదితరులు పాల్గొన్నారు.
హయత్‌నగర్ డివిజన్ కేంద్రంలోని పెద్ద మసీద్‌లో మొల్సబ్ను టీఆర్ఎస్ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ ఎస్ఐ సూర్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, టీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్, నాయకులు మనోజ్ ముదిరాజ్, ఖైలాశ్, తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి మన్సూరాబాద్ చౌరస్తాలోని మజీద్ ఏ సిద్ధిఖీ అక్బర్ మసీద్, హకీమాబాద్, కామినేని చౌరస్తా సమీపంలోని మసీద్, ఆటోనగర్‌తో పాటు నాగోల్ డివిజన్ పరిధిలోని పలు మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.