గంపేట్/ఎర్రగడ్డ/జూబ్లీహిల్స్/జూబ్లీహిల్స్/ వెంగళరావునగర్ మే 3: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రంజాన్ సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట్, సనత్‌నగర్, అమీర్‌పేట్, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్లో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు సంజీవ, మాజీ కార్పొరేటర్ జానీమియా, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద్గాల నిర్వాహకులు హుమాయూన్, జాకీర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, అప్పూఖాన్, తన్నూఖాన్.. ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌దాస్, నాయకులు అజర్, హసన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ రాజ్‌కుమార్‌తో కలిసి యూసుఫ్‌గూడ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కైసర్ జహాన్ ఇంటికి వెళ్లి ఈద్ ముబారక్ తెలిపారు.నాయకులు గీతాగౌడ్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
రహ్మత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.
వెంగళరావునగర్ డివిజన్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో కార్పొరేటర్ దేదీప్య విజయ్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్, అప్సర్, చోటూభాయ్, సమద్, ఇస్మాయిల్, ఉమర్, ఇమ్రాన్, అజీమ్, సల్మాన్, షోయబ్, నూర్ జహాన్, అజీజ్, ఘోజ్, జుబైర్, కైసర్ పాల్గొన్నారు.