హయత్‌నగర్, ఏప్రిల్ 29 : నార్మాక్స్ పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక సొమ్ము రూ.20.20 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ సంస్థలో నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, సంస్థ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంగుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ.20.20 కోట్లు విడుదల చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. పాడి రైతుల ప్రోత్సాహక పథకం కింద ఇప్పటి వరకు రూ.39.26 కోట్లు, పాడి పశువుల పంపిణీ కింద రూ.63.72 కోట్లు ప్రభుత్వం నుంచి తమ యూనిట్ పాడి రైతులకు అందినట్లు తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.