మేడ్చల్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో గులా బీ దళం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మం త్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రా జు శుక్రవారం మంత్రి మల్లారెడ్డితో పార్టీ స్థితిగతులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అంతటా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టానున్నమని, ఇందులో కార్యకర్తలు, నాయకులను భాగస్వాములు అయ్యేలా చూస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఏడున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని దీనిని ప్రజలంతా గుర్తించారన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రానున్న రోజులలో ఇతర పార్టీల అడ్రస్సులు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.
‘మే’లో సీఎం చేతుల మీదుగా ‘కలెక్టరేట్’..
మేడ్చల్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని మే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి చామకూ ర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి లో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అధికారులతో కలిసి మంత్రి మల్లారె డ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మంచి రోజు చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజల సౌకర్యా ర్థం జిల్లా కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శం భీపూర్ రాజు మాట్లాడుతూ, ప్రజల పారిపాలన సౌల భ్యం కోసం కలెక్టరేట్లు అందుబాటులో ఉండే విధంగా సీఎం కేసీఆర్ సమీకృత భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భవనాన్ని మం త్రి, ఎమ్మెల్సీలు పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.