రవీంద్రభారతి, ఏప్రిల్ 29: రవీంద్రభారతి ‘సరస్వతి సదనం, సరస్వతి వదనం’ ఈ వేదికపై నటరాజ స్వామి యే దర్శనమిస్తారని, ఎందరో గొప్ప కళాకారులు నృత్య ప్రదర్శన చేసి గొప్ప కళాకారులు అయ్యారని, నృత్యకళలకు స్ఫూర్తి దాయకంగా ఈ వేదిక నిలిచిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి అన్నా రు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్యోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు విచ్చేశారు. అనంతరం, డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ, నృత్య ప్రదర్శనలు, నృత్య రీతుల్లో విశేష కృషి సల్పిన కళాకారులను, ప్రముఖ నృత్య గురువులను గౌరవించుకోవడం మన సంప్రదాయమన్నారు.
పిల్లలకు చదువే ముఖ్యం కాదని, వారికి శాస్త్రీయ సంప్రదాయ నృ త్యాలు ఎంతో అవసరమన్నారు. శాస్త్రీయ నృత్యం అంటే నే ఆ నటరాజస్వామి దర్శనమిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పారు. అనంతరం సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరురి గౌరీశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ శాస్త్రీయ సంగీత, సా హిత్య, నృత్యాలకు తోడ్పాటునందిస్తున్నారని చెప్పారు. కార్యదర్శి వసుంధర వివిధ జిల్లాల నుంచి నాట్య కళాశాలల నుంచి నృత్య గురువులను, నృత్యకారులను ఈ వేదికపైకి తీసుకువచ్చి గురువులను సత్కరించడం అభినందనీయమన్నారు.