అంబర్‌పేట, ఏప్రిల్ 23: అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నా క, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో ఉన్న పలు పార్కులను అందంగా ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. నల్లకుంట డివిజన్ నరేంద్రనగర్‌లోని పార్కును శనివారం ఎమ్మెల్యే సందర్శించి ఆ పార్కులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. ఇందులోభాగంగా పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా సుందరీకరణ పనులను చేపట్టాలని, వివిధ రకాల మొక్కలను నాటాలని, టైల్స్, పెయింటింగ్ వేయడం, వాకింగ్‌కు వచ్చే వృద్ధులు, మహిళలకు కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేయడం, లైట్లు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు ఉద్యానవనశాఖఅధికారులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
సామాజిక సేవా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. శనివారం అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ జన్మదినం సందర్భంగా న్యూప్రేమ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో బాగ్‌అంబర్‌పేట సీజన్స్ దవాఖాన సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి ఆయన హజరై ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంతో మధుమేహం,రక్తపోటు సాధారణ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్తో,నాయకులు పాల్గొన్నారు.