e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిల్లాలు సర్కారు బడివైపే అడుగులు

సర్కారు బడివైపే అడుగులు

  • శేరిలింగంపల్లి మండలంలో 2350 అదనపు ప్రవేశాలు..
  • మియాపూర్‌, శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య

మియాపూర్‌, నవంబర్‌ 28 : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సర్కారు బడులు విద్యార్థులతో కిక్కిరిస్తున్నాయి. పరిస్థితులను తారు మారు చేసిన కరోనాతో ఆదాయంలేక ఫీజులు చెల్లించలేక పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ చిన్నారులను సర్కారు పాఠశాలల బాట పట్టించాయి. ఫలితంగా మండల పరిధిలోని సర్కారు పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో పెద్ద సంఖ్యలో ప్రవేశాలు నమోదయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలను ఉచితంగా అందించటంతో పాటు నాణ్యమైన విద్య, అత్యాధునిక డిజిటల్‌ విద్యను అందిస్తుండటంతో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా 2350 ప్రవేశాలు నమోదు చేసుకున్నాయి. మండలంలోని శేరిలింగంపల్లి ఉన్నత పాఠశాల అత్యధికంగా 1200 పై చిలుకు విద్యార్థులతో ప్రథమ స్థానంలో నిలవగా.. మియాపూర్‌ ఉన్నత పాఠశాల 950కి పైగా ప్రవేశాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

58 పాఠశాలలు.. 17,831 మంది విద్యార్థులు
శేరిలింగంపల్లి మండల వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్ని కలిపి మొత్తం 58 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 41, ప్రాథమికోన్నత పాఠశాలలు 4, ఉన్నత పాఠశాలలు 13 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 17,831 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో ఉన్నత పాఠశాలల్లోనే అధికంగా విద్యార్థులు ఉన్నారు. మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించగా.. అందులో మియాపూర్‌, శేరిలింగంపల్లి, దర్గా, కొత్తగూడ క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 16 వరకు పాఠశాలలు నమోదై ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి గాను మండలంలో 2350 అదనపు ప్రవేశాలు నాలుగు క్లస్టర్ల పరిధిలో నమోదయ్యాయి. వీటిలో శేరిలింగంపల్లి, మియాపూర్‌ పాఠశాలల్లోనే 200 లకు పైగా ప్రవేశాలు నమోదు కావడం గమనార్హం. మరో పక్క సింహభాగం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతుండగా.. ఆ మాధ్యమంలోనే అధిక ప్రవేశాలు నమోదయ్యాయి. మండలంలోని 58 పాఠశాలల్లో మొత్తం 376 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా.. మరో 30 వరకు ఖాళీలున్నాయి. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 80 శాతానికి పైగా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు వినియోగించుకుంటున్నారు.

- Advertisement -

నాణ్యమైన విద్యను అందిస్తాం..
ఈ విద్యాసంవత్సరంలో మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు అనూహ్య స్పందన వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా 2350 ప్రవేశాలు మండలంలోని ఆయా పాఠశాలల్లో నమోదయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థలలో నాణ్యమైన ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం ఇతర వసతులు లభిస్తాయి. కరోనా నేపథ్యంలో ప్రవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక వందలాది మంది విద్యార్థులు మండలంలో సర్కారు పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఉపాధ్యాయులు మరింత చిత్తశుద్ధితో కృషి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోమని నిరూపించాలి.

  • వెంకటయ్య, మండల విద్యాశాఖ అధికారి,శేరిలింగంపల్లి
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement