సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): వేసవిలో పెరిగే ప్రయాణికుల తాకిడి తట్టుకోవడానికి సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. సమ్మర్ కోసం మొత్తం 104 స్పెషల్ రైళ్లను నడుపుతున్నామన్నారు. ఇందులో 26 వీక్లీ రైళ్లు, మరో 78 ట్రై-వీక్లీ (వారానికి మూడు సార్లు) రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రైళ్లు పట్టాలెక్కుతాయన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి ఎర్నాకులం వైపుగా 26 ప్రత్యేక రైళ్లు, మచిలీపట్నం నుంచి కర్నూల్ మధ్య 78 రైళ్లను నడుపుతున్నామన్నారు. టిక్కెట్ రిజర్వేషన్, రైళ్ల రాకపోకలు సమయాలు, ఇతర పూర్తి వివరాల కోసం ఎస్సీఆర్ వెబ్సైట్ను సంప్రదించాలని జోన్ అధికారులు వెల్లడించారు.