జూబ్లీహిల్స్, మార్చి13: పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధ్దం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. మే 11 నుంచి 20 వరకు జరుగనున్న పబ్లిక్ ఎగ్జామినషన్స్కు విద్యార్థులను సంసిద్ధ్దం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్పెషల్ రివిజన్ క్లాసులు ప్రారంభించిన అధికారులు నేటి నుంచి పాఠ్యాంశాల వారీగా ఆన్లైన్ అసైన్మెంట్లు ఇవ్వనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 15 నుంచి ఏప్రిల్ 18 వరకు ఆరు రోజుల్లో 6 అసైన్మెంట్లు, సెకెండ్ లాంగ్వేజ్‌లో 19 నుంచి ఏప్రిల్ 12 వరకు నాలుగు రోజుల్లో 4 అసైన్మెంట్లు, ఆంగ్లంలో 16 నుంచి ఏప్రిల్ 16 వరకు ఐదు రోజుల్లో 5 అసైన్మెంట్లు, గణితంలో నేటినుంచి ఏప్రిల్ 13 వరకు ఏడు రోజుల్లో 7 అసైన్మెంట్లు, ఫిజికల్ సైన్స్‌లో 16 నుంచి ఏప్రిల్ 18 వరకు ఐదు రోజుల్లో 5 అసైన్మెంట్లు, బయాలజికల్ సైన్స్‌లో నేటినుంచి ఏప్రిల్ 11 వరకు ఐదు రోజుల్లో 5 అసైన్మెంట్లు, సోషల్ స్టడీస్‌లో 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆరు రోజుల్లో 6 అసైన్మెంట్లు సిద్ధ్దం చేశారు. విద్యాశాఖ ప్రత్యేకంగా సిద్ధ్దం చేసిన ఈ పాఠ్యాంశాల అసైన్మెంట్లు విద్యార్థులతో సాధనచేయించేందుకు సంబంధిత ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులకు వీటిని పంపించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో తరగతుల నిర్వహణ తగ్గిపోవడంతో ప్రాధాన్యత కలిగిన పాఠ్యాంశాలతో వీటిని సిద్ధ్దం చేసిన అధికారులు నేటినుంచి ప్రత్యేకంగా విద్యార్థులకు బోధించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి, కామన్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ఉత్తర్వులు ఇచ్చారు.