ఉప్పల్, మార్చి 13 : ఉప్పల్ నియోజకవర్గంలోని బస్తీ దవాఖానలో పనిచేసే సపోర్టింగ్ సిబ్బంది ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు నేషనల్ హెల్త్ మిషన్‌లో బస్తీదవాఖాన సిబ్బందిని కలిపేవిధంగా చూడాలని..ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాల న్నారు. బస్తీ దవాఖానలో పనిచేసే డాక్టర్లు, నర్సులకు వేతనాలు పెంచి..సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సంతోషరాణి, శ్రావణి, శ్రీలత, స్వాతి, శాంతమ్మ, స్వప్న, రాధా, అనిత, ఉమారాణి, స్వామి, సుమన్, సాయికిరణ్, నవీన్‌కుమార్, అశోక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతిపత్రం
నాచారం విలేజ్ భక్త సమాజం ప్రతినిధులువా ఆదివారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి, తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఎర్రం శ్రీనివాస్‌రెడ్డి, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, సాయిబాబా, ప్రేమ్‌కుమార్‌గౌడ్, సందీప్‌రెడ్డి, యాదగిరిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.