చర్లపల్లి, మార్చి 13 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కాప్రా డివిజన్, తిరుమల శివపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి.. కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజ కవర్గ పరిధిలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా మంచినీటి, డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిధులు కేటా యిస్తున్నామన్నారు. తిరుమల శివపురి కాలనీలో సమస్యలను పరిష్కరించడంతో పాటు పారిశుధ్య పనులను వేగవంతం చేసేం దుకు చర్యలు తీసుకుంటామని, కాలనీలో వీధిదీపాల నిర్వహణ మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవా లని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.