తులసీరామ్నగర్ లంకలో ఎమ్మెల్యే పాదయాత్ర
శాంతినగర్లో డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన
గోల్నాక, మార్చి 11: నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీరామ్నగర్ లంకలో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేశారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తమ బస్తీలో కొత్తగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, కొత్త వీధిదీపాల ఏర్పాటుతో పాటు కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టకి తీసుకువచ్చారు.అరకొర తాగునీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
డ్రైనేజీ పైప్లైన్ పనులు ప్రారంభం
గోల్నాక డివిజన్ శాంతినగర్లో సుమారు రూ. 4 లక్షల అంచనాతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ కొత్త పైప్లైన్ పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, మనోహర్, జలమండలి అధికారులు అశ్వక్, టీఆర్ఎస్ నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.