ముంపు ప్రాంతాల గుర్తింపు
నాలా పనులను చేయిస్తున్న అధికారులు, సిబ్బంది
మెహిదీపట్నం, మార్చి 11 : వర్షాకాలంలో ముంపు సమస్యలు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులు చేపట్టారు. మల్లేపల్లి డివిజన్లో ఉన్న అతిపెద్ద నాలా అఫ్జల్‌సాగర్ నాలా. ఈ నాలా వానకాలంలో పూర్తిగా నిండి నీరు ఇండ్లలోకి వెళ్లి సమస్య ఏర్పడుతుంది. దీనిపై ప్రజలు ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్‌కు ఫిర్యాదులు చేశారు. దాంతో నాలా పై కప్పు నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అఫ్జల్‌సాగర్‌లో నాలాపై కప్పు నిర్మాణ పనులను గురువారం అర్ధరాత్రి తర్వాత చేపట్టారు. ఈ పనులను ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి జాఫర్‌ఖాన్ స్థానికులతో కలిసి పరిశీలించారు.
మెహిదీపట్నంలో డ్రైనేజీ మరమ్మతులు..
నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్ ఎస్బీఐ కాలనీలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పర్యటించి డ్రైనేజీ మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను జలమండలి డీజీఎం వికాస్, జీహెచ్ఎంసీ ఏఈ రవి పర్యవేక్షణలో సిబ్బంది పూర్తి చేశారు.
వేసవిలో నీటి సమస్యలు ఏర్పడకుండా..
వేసవిలో నీటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని జలమండలి మెహిదీపట్నం డీజీఎం వికాస్ అన్నారు. శుక్రవారం ఆసిఫ్‌నగర్ డివిజన్లో ఎంఐఎం నాయకులతో కలిసి జలమండలి అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రతినిధి మూసా స్థానిక సమస్యలు తెలిపారు. కలుషిత నీటి సరఫరాను అడ్డుకోవాలని, లోప్రెషర్ నిలువరించాలని స్థానికులు డీజీఎంను కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.