చిక్కడపల్లి, మార్చి 11: బాగ్‌లింగంపల్లిలోని భగత్‌సింగ్‌నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు గుడిసెలు కాలిపోయాయి. బాలమణి అనే మహిళ ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లగా అగ్నిప్రమాదం జరుగగా ఆమె గుడిసె పూర్తిగా దగ్ధమైంది. మంటలు పక్క గుడిసెకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. పోలీసులు వివరాలను సేకరించారు. రూ.50వేల నగదు, ఆధార్, రేషన్ కార్డులు కాలిపోయాయని బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా ప్రభాస్ కూడా రూ.10వేలు బూడిదయ్యాని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ గిడ్డయ్య దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను ఆదుకుంటాం.
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలసుకున్నారు. అధికారులో మాట్లాడి సహాయం అదించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, వెంకటకృష్ణ (బబ్లు), ముచ్చకుర్తి ప్రభాకర్, వివేక్, కల్యాన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.