వెంగళరావునగర్,మార్చి 11: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంగళరావునగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్కు వద్ద శుక్రవారం సాయంత్రం మహిళలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటించడంతో వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రార్థనలు
వెంగళరావునగర్: సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడి ఆయన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యుసుఫ్గూడ కృష్ణకాంత్ పార్కు వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.