హిమాయత్‌నగర్,మార్చి11: దేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి యం. నర్సింహ, సీఐటీయూ నగర కార్యదర్శి యం.వెంకటేశ్, ఐఎఫ్‌టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్పద్మ మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికివదిలేసి సంపన్న వర్గాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28,29 తేదీల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మద్దతూ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24న షాపింగ్ మాల్స్‌ల వద్ద కరపత్రాల పంపిణీ, 26న బైక్‌ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్మిక వర్గం అధిక సంఖ్యల్లో పాల్గొన్నాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు ఎండీ అంజాద్,జి.అనురాధ,మల్లేశ్, కిషన్, కుమారస్వామి,కిరణ్,హరి కుమార్ పాల్గొన్నారు.