మంది భూ నిర్వాసితులకు రూ.8.30 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు
సంవత్సరాలుగా నిలిచిపోయిన రాకపోకలు ప్రారంభించ నున్నట్లు వెల్లడి
గౌతంనగర్, మార్చి11 : మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడం గర్వకారణంగా ఉందని స్థానికులు తెలిపారు. 15 సంత్సరాల కాలంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ ప్రాంతమంతా అభివృద్ధికి నోచుకోలేదు. కమాన్ రోడ్డు విస్తరణ చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎన్నికల్లో మాట ఇచ్చారు. కమాన్‌ను ఆనుకోని ఆశుర్ఖాన ఉంది. ముస్లింలలో ఉన్న రెండు వర్గాల వారితో పాటు, స్థానిక వ్యాపారస్తులతో పలుసార్లు చర్చించి అభివృద్ధి కోసం వారందరినీ ఒకేతాటిపైకి ఎమ్మెల్యే తీసుకువచ్చారు. ప్రభుత్వం తరపున 32మంది భూ నిర్వాసితులకు రూ.8.30 కోట్ల నష్ట పరిహారం చెల్లించారు. కమాన్ ఇరువైపుల రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేశారు. కమాన్‌ను ఆనుకోని ఉన్న ఆశుర్ఖానాను మరో చోట ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీఇచ్చారు. అన్ని వర్గాల వారు అందించిన సహకారంతో మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పూర్తి అయింది. త్వరలోనే కమాన్ రోడ్డు గుండా బస్సులు, అంబులెన్స్‌లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు విస్తరణ ఘనత ఎమ్మెల్యే దే
మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ చేయిం చడం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోనే సాధ్యమైంది. మతపరమైన ఆశుర్ఖాన మరో చోటకు మార్పించడం, స్థల యజమానులను ఒప్పించడం ఆయనకే సాధ్యమైంది. మతపరమైన అంశంతో కమాన్ ఉంది. అందుకే రోడ్డు కటింగ్ కాదు అన్ని అనుకున్నా అందిరితో చర్చించి అందరి ఆమోదంతో రోడ్డు వెడల్పు చేయించారు.
– ఆదినారాయణ, మౌలాలి