ఎర్రగడ్డ, మార్చి 10: సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మహిళా దినోత్సవంలో భాగంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు గురువారం కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారన్నారు.
ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన శుభవార్త వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. ఈ కానుకల పంపిణీ కార్యక్రమానికి డివిజన్ నుంచి వందలాది మంది మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మహిళలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, రవినాయుడు, యూసుఫ్, మేరీ, ధనలక్ష్మి, రమేశ్నాయక్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.