జూబ్లీహిల్స్,మార్చి10: మహిళలను గౌరవించే సంస్కృతి తమదని, తెలంగాణ నుంచి ఈ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా అత్యంత వైభవంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి మహిళా బంధు కేసీఆర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిచ్చి వారిని గౌరవించిందన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు సీఎం కేసీఆర్‌కు మహిళల పై ఉన్న గౌరవాన్ని చాటిచెబుతాయన్నారు. దేశంలోనే ఎక్కడాలేని వి ధంగా షీ టీమ్స్ మహిళలకు అండగా ఉంటున్నారన్నారు. ఈ సందర్భంగా బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళలందరికీ ఎమ్మెల్యే ప్రత్యేక బహుమతులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మ న్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, బషీర్, రవిశంకర్, మహిళా అధ్యక్షురాలు ధనుజ, స్రవంతి, లక్ష్మి, తబిత, రమాదేవి, సోని తదితరులు పాల్గొన్నారు.