అబిడ్స్/ సుల్తాన్‌బజార్, మార్చి 9: అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిల పంపిణీ చేసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ నేతృత్వంలో బేగంబజార్‌లో సంబురాలు నిర్వహించారు. జాంబాగ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నాయకులు ఆనంద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరిసింగ్, ప్రియాగుప్తా, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, శశిరాజ్సింగ్, రాజేశ్ సింగ్, ఖైసర్, జోగేందర్ గుప్తా, దుర్గక్క, మాధవి, బాలన్, నర్సింగ్, రాకేష్‌సింగ్, బల్వీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ తన కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గోషామహల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముఖేష్‌సింగ్ బస్తీలలో నిరుద్యోగులకు మిఠాయిలను తినిపించారు. వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ మిఠాయిలను పంపిణీ చేశారు.
బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద…
రవీంద్రభారతి,మార్చి9: అసెంబ్లీలో నోటిఫికేషన్ల ప్రకటనను స్వాగతిస్తూ బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద గడ్డిమల్కాపుర మార్కెట్ మాజీ చైర్మన్, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ సెల్ మాజీ అధ్యక్షుడు సంజయ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలను గుర్తించి 91వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన కొనియాడారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో శుభసూచకమని, తెలంగాణ నిరుద్యోగ యువత సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని చెప్పారు. ప్రతిపక్షపార్టీలు ఏ పనిలేక పనికట్టుకొని సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు ఎక్బాల్అలీ, మాజీద్, సురేశ్, సర్వర్, మహేందర్, రాజిరెడ్డి ,పవన్, మహ్మద్ యూసుప్, మోహన్ పాల్గొన్నారు.
నా జీవితాన్ని మార్చుకుంటా
ఐదేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏనాడు ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లపై ప్రకటన రాలేదు. తప్పని సరిగ్గా ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా. ఈ సారి నా జీవితాన్ని మార్చుకుంటా.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ మొదటి నుంచి మాట ఇస్తే తప్పలేదు. భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయం. ఆరేండ్లుగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూశాం. ఈ రోజు ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లపై ప్రకటన చేయడంతో సంతోషంగా ఉన్నాం. ఇతర పార్టీలు విమర్శలకు చెక్ పెడుతూ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.