ఘట్కేసర్,మార్చి8 : అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీలో గల రహేజా కంపెనీ మున్సిపాలిటీకి అందజేసిన రూ.20 లక్షల విలువైన స్వీపింగ్ మిషన్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ సురేష్, మేనేజర్ నర్సింహులు, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి , మహిళలు, టీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, శేఖర్ ముదిరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ పరిధి బొల్లిగూడ వైఎస్‌నగర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జయరాజ్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడి కుటుంబానికి రూ.2లక్షల చెక్కును బాధితుడి తల్లికి తన నివాసంలో అందజేశారు. కార్పొరేటర్ రాసాల వెంకటేశ్‌యాదవ్, లోకేశ్, శేఖర్ పాల్గొన్నారు.