మన్సూరాబాద్, మార్చి 7: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్మశానవాటికలను అభివృద్ధి చేసి అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చే ప్రజలకు పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి శ్రీరామహిల్స్కాలనీ, మధురానగర్, హిమపురికాలనీ, ఆటోనగర్‌లోని హిందూ శ్మశానవాటిక, పవనగిరికాలనీఫేజ్-2, ఎల్ఐసీకాలనీ, వీరన్నగుట్టలో రూ.2.15కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటోనగర్‌లోని హిందు శ్మశానవాటికలో శ్రీవైష్ణవులు అపరకర్మలు చేసుకునేందుకు వీలుగా స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. హిమపురికాలనీలో రోడ్డు మధ్యలో ఉన్న సమాధులను తొలగించేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమాదులు ఏర్పాటు చేసుకోవడం వలన భవిష్యత్తులో అంత్యక్రియులు నిర్వహించుకునేందుకు స్థలం ఉండదని తెలిపారు. శ్మశానవాటికల్లో పూర్తిగా పచ్చదనాన్ని పెంపొందించి పార్కుల మాదిరిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, శ్రీరామహిల్స్కాలనీ అధ్యక్షుడు ఎం.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రాంచంద్రయ్య, రాంచంద్రారెడ్డి, హిమపురికాలనీ ప్రతినిధులు కె.వెంకటాచార్యులు, మధుసూదన్‌రెడ్డి, బద్రీ, యాద సంతోష్‌కుమార్ గుప్తా, రామాచారి, పవనగిరికాలనీ ఫేజ్-2 అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, కార్యదర్శి రాంగోపాల్, కోశాధికారి పవన్‌కుమార్ గౌడ్, వీరన్నగుట్ట కాలనీ అధ్యక్షుడు కేకేఎల్ గౌడ్, కార్యదర్శి దేవ, నాయకులు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, కొసనం ధనలక్ష్మి, పోచబోయిన జగదీశ్‌యాదవ్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, టంగుటూరి నాగరాజు, కొసనం వెంకట్‌రెడ్డి, సిద్దగౌని జగదీశ్‌గౌడ్, టి.మోహన్‌రెడ్డి, చెంగల్ చంద్రమోహన్, అత్తాపురం రాంచంద్రారెడ్డి, పారంద నర్సింగ్‌రావు, సిద్దగౌని నర్సింగ్‌గౌడ్, నర్రి అంజయ్య, యాద సంతోష్‌కుమార్ గుప్తా, కె.వెంకటాచార్యులు, కేకేఎల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.