మహేశ్వరం, మార్చి 7: కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రావిరాల మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో 100 మంది మత్య్యకారులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మార్కెటింగ్ కోసం వాహనాలను సమకూర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులవృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అన్నారు. అన్ని వర్గాలు, కులాల వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలను అందుకుంటున్నారని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి.. జీవనోపాధికి వాహనాలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జిల్లెల లక్ష్మయ్య, నాయకులు శేఖర్‌రెడ్డి, నర్సింహ, నాగేశ్వర్‌గౌడ్, మత్యకారుల సంఘం అధ్యక్షుడు గుంటి గణేశ్, మత్స్యకారులు పాల్గొన్నారు.