అబిడ్స్, మార్చి 7 : భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ పదవ తేదీన నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను శ్రీరామ నవమి ఉత్సవ సమితి ప్రతినిధులు కోరారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో ఆయనను కలిసి శ్రీరామ నవమి శోభాయాత్ర గురించి వివరించారు. అందుకు నగర పోలీస్ కమిషనర్ స్పందించి పూర్తిగా సహకరిస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసిన వారిలో భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్‌రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్నారాయణ రాఠి, వీహెచ్‌పీ అద్యక్షుడు రామరాజు, కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ మెట్టు వైకుంఠం, మహేందర్ వ్యాస్, విమల్ దాలియా, శ్రీరాం వ్యాస్ ఉన్నారు.