అంబర్‌పేట/గోల్నాక, మార్చి 7 : ‘మహిళా బంధు కేసీఆర్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ యూపీహెచ్సీ ఆవరణలో ఆశ వర్కర్లు, మహిళా సిబ్బందికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మహిళా బంధు కేసీఆర్’ పేరట మహిళా దినోత్సవ సంబరాలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కాలేరు దీప్తిపటేల్, వైద్య సిబ్బంది దేవకి, మాధురి, మన్యాల, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, ఎస్. సులోచన, శ్రీరాములుముదిరాజ్, దిలీప్, శివాజీయాదవ్, నర్సింగ్, మహేశ్, స్వర్ణ, అరుణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుకు బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో సోమవారం కృష్ణానగర్‌లో దళితులతో కలిసి డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం నేడు స్వాతంత్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న వేల 75 ఏండ్ల స్వాతం త్య్రం సాక్షిగా దళిత జాతి సాధికారికత అనేది కలగానే మిగిలిపోయిందన్నారు. దళితుల పేదరికాన్ని, సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధంగా సీఎం కేసీఆర్ దళితబంధును తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బీష్మాదేవ్, ఆర్కేబాబు, లక్ష్మ ణ్, కె. నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా గోల్నాకలో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ పలు రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలతో కలసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారికి బహుమతులను అందజేశారు.