సుల్తాన్‌బజార్, మార్చి 7 : శస్త్ర చికిత్స అనంతరం రోగికి పోస్ట్ ఆపరేటివ్ వార్డు అవసరమని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉస్మానియా దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్‌లో 1965 బ్యాచ్ విద్యార్థులు, లయన్స్ క్లబ్ హైదరాబాద్, సికింద్రాబా ద్ సంయుక్తాధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోస్ట్ ఆపరేటివ్ వార్డును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పోస్ట్ ఆపరేటివ్ వార్డు నిర్మాణానికి సహకరించిన 1965 బ్యాచ్ విద్యారు లు,లయన్స్ క్లబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ఉస్మానియా దవాఖాన అభివృధ్దికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ బి. నాగేందర్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దవాఖాన సూపరింటె ండెంట్ డాక్టర్ బి.నాగేంద ర్ మాట్లాడుతూ దవాఖాన పాత భవనం మూసివేసిన అనంతరం శస్త్ర చికిత్స అనంతరం పడకల కొరత ఉండేదన్నారు. ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ఇన్చార్జిగా సీఏ ఎస్ఆర్ఎంవో డాక్టర్ సుష్మా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపై ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పల్ల ప్రవీణ్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బి. శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ రఫీ, డాక్టర్ సిద్దిఖీ, డాక్టర్ నరేంద్రకుమార్, డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధవి, డాక్టర్ సుష్మా, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ కవిత, డాక్టర్ జాఫర్ హష్మీ, డాక్టర్ విజయ్‌కుమార్ యాదవ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత రాథోడ్,సిబ్బంది పాల్గొన్నారు.