రెండో రోజు ఘనంగా ‘మహిళా బంధు కేసీఆర్’ ఉత్సవాలు
ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, మార్చి 7 : అంతర్జాతీ య మహిళా దినోత్సవంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట జరుగుతున్న ఉత్సవాలు సోమవారం రెండవరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో కేక్‌లు కట్‌చేసి.. సెల్ఫీలు దిగి.. మహిళలకు బహుమతులు, చీరలు పంపి ణీ చేసి సన్మానించారు. అనంతరం కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వీట్లు పంచిపెట్టారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పలువురు అన్నారు.
ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్హిల్స్, కుర్మానగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి మస్కా సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, నోముల మైసయ్య పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఎల్ఈడీ టీవీని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారిణి డా.సౌందర్యలత, సూపర్వైజర్ ప్రకాశ్, గొంగడయ్య, జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల సంతోశ్‌రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, సుభద్ర, ఉషారాణి, అనసూయ, అండాలు, సత్యవతిపాల్గొన్నారు.
నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం-ఈఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో డా.పద్మజ, విక్టోరియా, శ్రీనివాస్, డా.నాగేందర్, డా.రజ్వత్, డా.మధు, డా.రవి పాల్గొన్నారు.
ఉప్పల్, చర్చికాలనీలో మౌంట్పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ రజితారెడ్డి హాజరయ్యారు. వివిధ రం గాల్లో ప్రతిభచాటిన మహిళలకు బహుమతులు అందజేశారు.
కాప్రా డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, రేగళ్ల సతీశ్‌రెడ్డి, పవన్, పాండుగౌడ్, శ్రీకాంత్, కొప్పుల కుమార్, మహిళా అధ్యక్షురాలు సురేఖ, భిక్షపతి, గౌస్, చందు, లింగం, సుశీల్, డివిజన్ టీఆర్ఎస్ మహిళలు పాల్గొన్నారు.
హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళ లబ్ధిదారులను కలిసి వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో భాగ్యమ్మ, పర్వీన్, క్రిష్ణవేణి, శ్రీవాణి, నాయకులు సాయికుమార్, బాలనర్సింహ, యాదగిరి, రామక్రిష్ణ, నవీన్‌గౌడ్, రాందాస్, మల్లేశ్, జయపాల్, శేఖర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ అంబేద్కర్ భవన్లో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఆటల పోటీలను కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, వాసుగౌడ్, హమాలీ శ్రీనివాస్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అలాగే.. నెహ్రూనగర్‌లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళల సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మ హిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ‘మహిళా బంధు’ వేడుకలు నిర్వహించి.. పోలీస్‌స్టేషన్ సిబ్బంది, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సీఐ మన్మోహన్‌తో కలిసి ఆయన చీరలు, మిఠాయి లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, బేతాల బాల్‌రాజు, శేర్ మణెమ్మ, కందుల లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, కందాడి సుదర్శన్‌రెడ్డి, యాకయ్య, శిరీషారెడ్డి, శోభారెడ్డి, మల్కా రామాదేవి, సజ్జ రామతులసి, దుర్గా, సత్యమ్మ, లక్ష్మితో పాటు పోలీస్‌స్టేషన్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్, చక్రీపురం సిరి గార్డెన్లో నిర్వహించిన ‘మహిళా బంధు’ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన అనంతరం పారిశుధ్య మహిళా కార్మికులు, వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బన్నాల గీత, పన్నాల దేవేందర్‌రెడ్డి, స్వర్ణరాజు, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, మేకల హనుమంత్‌రెడ్డి, గంధం జ్యోత్స్న, నాయకులు పాల్గొన్నారు.