మల్కాజిగిరి, మార్చి 7: మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాల్లో భాగంగా సోమవారం వెంకటాపురం డివిజన్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, పింఛన్ లబ్ధిదారుల ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నదని.. దళిత మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధులో రూ.10లక్షలతో స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేస్తున్నదని అన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూళ్లలో ఉచితంగా విద్యను అందజేయడంతోపాటు విదేశాల్లో చదవడానికి మహిళలకు రూ.20లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నదని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,00.116ల ఆర్థిక సహాయం చేస్తున్నామని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించడానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, అమృత, లక్ష్మి, ఉదయ, రమ్య, నాయకులు అనిల్‌కిశోర్, శివ, మోసిన్, ప్రభాకర్, సుదేశ్, కుట్టి, జ్ఞాని, పెంటన్న, నరేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
గౌతంనగర్ డివిజన్లో ..
గౌతంనగర్, మార్చి7 : గౌతంనగర్ డివిజన్ పరిధిలో సోమవారం కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందిరానెహ్రూనగర్, రామాంజనేయనగర్, వెంకటేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్‌తో పాటు టీఆర్ఎస్ నా యకులు ఇంటింటికీ తిరిగి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీమూబారక్ చెక్కులను అందించి.. చీర, స్వీట్లను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.