ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, మార్చి 6 : మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు మహిళా దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగునంగా ఆదివారం బాగ్‌లింగపల్లి సుందరయ్య పార్కు వద్ద రాంనగర్ డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు మోజస్, వెంక ట కృష్ణ, డివిజన్ మహిళా అధ్యక్షురాలు నీలాదేవి, కల్పన, సంపూర్ణ, మహేశ్వరి, లక్ష్మి, నాగరాణి, ముదిగొండ మురళి, జయదేవ్, జ్ఞానేశ్వర్‌గౌడ్, పాండయ్య, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లలోని పలు చోట్ల సీఎం కేసీఆర్ ప్లెక్సీలకు మహిళలు రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, రఫిక్, కల్వ గోపి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రాంచందర్, రాజశేఖర్ గౌడ్, ఆర్. రాజేశ్, వేణు, భోలక్‌పూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్, మహ్మద్‌అలీ, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్‌గౌడ్, బడుగు ప్రవీణ్ కుమార్, ప్రవీణ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రవీందర్, ఉప్పలయ్య, పిట్ల పద్మావతి పాల్గొన్నారు.
మహిళా సంఘం ఆధ్వర్యంలో…
కవాడిగూడ మహిళా సంఘం మహిళా నాయకురాలు ఎస్. రూపా, ఎం మంజుల ఆధ్వర్యంలో కవాడిగూడ మసీద్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ హాజరై వృద్ధులను సత్కరించారు. పలువురు మహిళలకు గాజులు, బ్లౌజ్‌పీస్‌లు పంపిణీ చేశారు.
ముషీరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పారిశుధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు చీరలు, పండ్లు పంపిణీ చేసి పలువురిని ఘనంగా సత్కరించారు.‘మహిళా బంధు కేసీఆర్’ పేరట నిర్వహించిన సంబురాల్లో పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు సీఎం కేసీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. సురేందర్‌ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని పలువురు మహిళలను సత్కరించారు. మాజీ కార్పొరేటర్ బి. హేమలతారెడ్డి, అనూరాధ, భాగ్యలక్ష్మి, స్నేహలత, శైలజ, లత, ఉమ, సుకన్య, మంగ తదితరులు పాల్గొన్నారు. ముషీరాబాద్‌లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు శోభ, రజిని, ఉమామహేశ్వరి, ప్రమీల, ఉమారాణి, నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, ముఠా జయసింహ, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, టి. సోమసుందర్, సాంబశివరావు, డి.శివముదిరాజ్లు పాల్గొన్నారు.