ఘట్కేసర్, ఫిబ్రవరి 22 : మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ప్రజాప్రతినిధులు, నాయ కులు అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు స్వీకరించి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మంత్రి మల్లారెడ్డి హయాంలో మున్సిపాలిటీలు ,మండలంలోని గ్రామాలు ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండేండ్లలో ఇరు మున్సిపాలిటీలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా మంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఘట్కేసర్, పోచారం చైర్మన్లు ఎం.పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు పి.వెంకటేశ్వరావు,ప్రధాన కార్యదర్శులు రాధాక్రిష్ణ, శేఖర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.