నేరేడ్మెట్, ఫిబ్రవరి 22 : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళ వారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్ జేజేనగర్లో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా పలు కాలనీవాసులు.. సమస్యలను, ఫిర్యాదులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.. బస్తీలు, కాలనీల్లో సమస్యలు తెలుసుకుని.. వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపడంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ సృజన, డిప్యూటీ తాసీల్దార్ రేణుక, ఆర్ఐ రంజిత్, జలమండలి జీఎం సునీల్ కుమార్, డీజీఎం భాస్కర్, ఏడీఈ ముత్తయ్య, ఏసీపీ గజానంద్, టీపీఎస్ తుల్జాసింగ్, ఏఎస్వో సరస్వతి, కా ర్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, నాయకులు రావుల అంజయ్య, ఉపేందర్‌రెడ్డి, జీవగన్, కరంచంద్, సాయికుమార్, మహత్యవర్ధన్, జీఎన్వీ సతీశ్‌కుమార్, గుండా నిరంజన్, ప్రసాద్, ఆలం మహేశ్ యాదవ్, గోపీనాథ్, గోకుల్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, చిందం శ్రీనివాస్‌రెడ్డి, చెన్నారెడ్డి, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.