కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 18 : కాలనీలు, బస్తీలలోని ప్రతీ ఇంటి నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ కేపీహెచ్‌బీ కాలనీగా మార్చాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ వార్డు కార్యాలయం వద్ద కొత్తగా కేటాయించిన స్వచ్ఛ ఆటోలను కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా స్వచ్ఛ ఆటోలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాజేశ్, కట్ట నరసింగరావు, రామారావు, నరసింహారెడ్డి, రాంబాబు నాయుడు, కచిన్, గఫూర్, రాము, మస్తాన్, మూర్తి, వాసు, ఎస్ఆర్పీ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏలు సూరి, శివ ఉన్నారు.
స్వచ్ఛ పరిసరాలే లక్ష్యం..
స్వచ్ఛ పరిసరాలే లక్ష్యంగా పనిచేయాలని ప్రతీ ఇంటినుంచి చెత్తను సేకరించి ట్రాన్స్ఫర్ చేసేందుకు తరలించాలని బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు అన్నారు. శుక్రవారం బాలాజీనగర్ వార్డు కార్యాలయంలో కొత్తగా కేటాయించిన స్వచ్ఛ ఆటోలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అందరూ బాధ్యతగా పనిచేస్తే స్వచ్ఛ డివిజన్‌గా మారుతుందన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్ రెడ్డి, జవాన్ బుజ్జి, ఎస్ఎఫ్ఏ చిరంజీవి, స్థానిక నేతలు సుశీల్, శారద, అనిత ఉన్నారు.