కవాడిగూడ, ఫిబ్రవరి 18: కరోనా నియంత్రణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేసిన ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని యూపీహెచ్సీ సెంటర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను 19 మంది ఆశ వర్కర్లకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మిలతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పరీక్షలు, గర్భిణులకు వైద్య పరీక్షలు, తదితర సమాచారాన్ని పొందుపర్చడానికి ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను ఇవ్వడం మంచి కార్యక్రమమని అన్నారు. ప్రతి రోగి ఆరోగ్య విషయమంతా ఎంట్రీ అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. అదే విధంగా ఈ నెల 27న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, మాజీ అధ్యక్షుడు కల్వ గోపీ, రాంచందర్, నాయకులు రాజశేఖర్‌గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.