అబిడ్స్ / సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 18 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కింగ్‌కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ పద్మజ అన్నారు. శుక్రవారం కింగ్‌కోఠి క్లస్టర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 102 మంది ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు, సిమ్‌కార్డులను గగన్‌మహల్ యూపీహెచ్‌సీలో ఆమె ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి అందజేశారు. అనంతరం ఇసామియా బజార్, సుల్తాన్‌బజార్, బొగ్గుల కుంట యూపీహెచ్‌సీల్లోని ఆశవర్కర్లకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. యూపీహెచ్సీల పరిధిలోని స్లమ్, బస్తీ, కాలనీల్లోని గ ర్భిణులు, ఇమ్యూనైజేషన్, వ్యాక్సినైజేషన్, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు వివరాల సేకరణను రికార్డుల్లో పొందుపరిచేవారు. ఇకమీదట స్మార్ట్ఫోన్లు ఇవ్వడంతో ఆన్లైన్లో వివరాలను పొందుపర్చడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లను అందించడంతో ఆశవర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేరుగా ఆశవర్కర్లతో టెలికాన్ఫరెన్స్ లను నిర్వహించడానికి దోహదం చేస్తుందన్నారు. కొవిడ్ కారణంగా నిత్యం బస్తీల్లో తిరిగి సర్వే నిర్వహించడంతో పాటు జ్వర సర్వే, వ్యాక్సినేషన్, కొవిడ్ సర్వేలతో పనిభారం పెరిగిన ఆశ వర్కర్లకు ఈ స్మార్ట్ఫోన్లతో వివరాలను పొందుపర్చవచ్చన్నారు.
మహారాజ్‌గంజ్ యూపీహెచ్‌సీలో..
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు యూపీహెచ్‌సీల్లో వర్కర్లకు సెల్ఫోన్లను శుక్రవారం పంపిణీ చేశారు. ప్రతి యూపీహెచ్‌సీలో 20 మంది వరకు ఆశవర్కర్లు ఉన్నారు. పన్నీపురా యూపీహెచ్సీ క్లస్టర్ పరిధిలో 130 మంది ఆశవర్కర్లు ఉండగా మహారాజ్‌గంజ్ యూపీహెచ్‌సీలో స్మార్ట్ ఫోన్ల పంపిణీని చేపట్టారు. అన్ని యూపీహెచ్‌సీల్లోని పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు..
మహారాజ్‌గంజ్ యూపీహెచ్‌సీలోని ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీని చేపట్టారు. పన్నిపురా క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లీశ్వరి, గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు ఎస్. ధన్‌రాజ్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్ మాట్లాడుతూ.. జ్వర సర్వే విజయవంతం చేయడంలో ఆశవర్కర్లు కీలకపాత్ర పోషించారన్నారు.