చంపాపేట, డిసెంబర్20 : కుమ్మరి వృత్తిదారులు ఆర్థిక అభివృద్ధితో పాటు రాజకీయంగా ఎదగాలని కుమ్మర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నడికుడా జయంత్ రావు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ అన్నారు. మంగళవారం చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్ చౌరస్తాలోని ఆనంద్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కుమ్మరి సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య 2వ వర్ధంతి సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో కుమ్మరుల ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజమల్లయ్య సతీమణి విజయమ్మ, కుమారులు జయలేఖ్, జయసింహ, సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండాల గోవర్ధన్, అసోసియేషన్ అధ్యక్షులు కుమ్మరి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు వీరేశం, శ్యాంకుమార్, సంఘ సభ్యులు శంకర్, అశోక్, మల్కాజిగిరి యాదయ్య, సుభాశ్, బాల్‌రాజ్, మోహన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, జంగయ్య పాల్గొన్నారు.