కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 16 : ఆస్తిపన్ను చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. శుక్రవారం సర్కిల్ ఆఫీస్లో ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. వార్షిక యేడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని వందశాతం సాధించాలని ఆ దిశగా చర్యలు తీసుకోవలన్నారు. మొండి బకాయిలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని.. స్పందించని వారికి నోటీసులందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీలు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఉన్నారు.