సిటీ బ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ);వైద్య రంగంలో 5జీ టెక్నాలజీ వినియోగం చికిత్సలో గేమ్ చేంజర్ కానుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై 5జీ ప్రభావం అంశంపై జరిగిన జాతీయ స్థాయి కన్వెన్షన్‌లో ఈ
కరోనా తెచ్చిన వర్చువల్ ట్రీట్మెంట్..
వైద్య రంగంలో కరోనా కంటే ముందు, తర్వాత అనే విధంగా టెక్నాలజీ ప్రభావం ఏర్పడింది. ఒకప్పుడు టెలి మెడిసిన్, వర్చువల్ ట్రీట్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ అనేవి మెరుగైన నెట్వర్క్ విధానం లేక వినియోగం తక్కువగా ఉండేది. కానీ 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వేగవంతమైన టెలీమెడిసిన్ విధానంతో రెగ్యులర్ చెకప్, ఐసీయూ మానిటరింగ్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో అంతరాయం లేని నెట్‌వర్క్‌తో డిసిషన్ మేకింగ్‌కు సాయపడుతుందని చెబుతున్నారు. లండన్‌లో ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీత ఆర్. కొవ్వూరి వైద్య రంగంలో 5జీ నెట్ వర్క్ వినియోగం, ప్రభావంపై అందజేసిన సైంటిఫిక్ థీసిస్‌లో 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రపంచ దేశాల్లో మారిన వైద్యం తీరును వివరించారు. టెలీమెడిసిన్, రిమోట్ అసిస్టెంట్, ఎమర్జెన్సీ కేర్, రిమోట్ రోబోటిక్ సర్జరీ, మెడికల్ ట్రీట్మెంట్లో ఆటోమేషన్, మెంటల్ హెల్త్ మేనేజ్మెంట్, ట్రీట్మెంట్లో గుండె, లివర్, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, మెదడు వంటి ముఖ్యమైన అంతర్భాగాలకు చేసే ఆపరేషన్లలో మెరుగైన నెట్‌వర్క్‌కు ప్రాముఖ్యత పెరగనుందని తెలిపారు. అయితే వేగవంతమైన 5జీతో హ్యాకింగ్ రిస్క్, సైబర్ దాడులకు అవకాశం ఉంటుందని అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేశారు.
వైద్యరంగంలో 5జీ వినియోగం
చిన్నపిల్లల్లో యాైంగ్జెటీ డిజార్డర్‌ను తొలగించేందుకు వినియోగించే చిల్ పాండా మొబైల్ యాప్‌ను 5జీ టెక్నాలజీతో మరింత సులభంగా వినియోగించే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నర్సింగ్ హోమ్‌లలో నిపుణులైన వైద్యుల వర్చువల్ కన్సల్టేషన్లు పెరిగి వైద్యాన్ని విస్తరించవచ్చు. అదేవిధంగా ఎక్స్ రే, ఎంఆర్ఐ, ఇతర ల్యాబ్ రిపోర్టుల ట్రాన్స్ఫర్ కూడా వేగంగా జరిగి, విదేశాల్లో వైద్య నిపుణుల సలహాలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు ఉండగా… నాడీ వ్యవస్థకు సంబంధించి జరిగే రొబోటిక్ రిమోట్ ఆపరేషన్లలో 5జీతో ఖచ్చితమైన ఫలితాలను పొందేందుకు వీలు ఉంటుంది.
వైద్యరంగంలో 5జీ ప్రాధాన్యత పెరుగుతుంది
5జీ టెక్నాలజీ వైద్యరంగంలో ప్రాధాన్యత ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వర్చువల్ ట్రీట్మెంట్, రొబోటిక్ ఆపరేషన్లలో ఎక్కువగా 5జీ సాయంతో చేస్తున్నారు. వేగవంతమైన నెట్‌వర్క్‌తో కీలక ఆపరేషన్లు కూడా సులభంగా చేసేందుకు వీలు దొరుకుతుంది.
– డాక్టర్ సునీత , కన్సల్టెంట్ ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్
సాంకేతికత వినియోగంలో ఇండియా మేటి
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అమలు చేయడంలో భారత్ అన్ని దేశాల కంటే మెరుగ్గా ఉంటుందని ఏపీ ప్రభుత్వ మాజీ ఐటీ అడ్వైజర్ డా. టీహెచ్ చౌదరి అన్నారు. జాతీయ స్థాయి కన్వెన్షన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డా. ఎం. లక్ష్మినారాయణ, ఐఈఐ గౌరవ సెక్రటరీ డా. సీతారామబాబు, అభిషేక్ గుప్తా, అనిష్ మహావీర్ భార్గవ్, కెనరా బ్యాంక్ డీజీఎం కణిమోజీ, గున్ను పద్మావతి, ఐఈఐ కన్వీనర్ సుబ్బిరెడ్డి, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.