సుల్తాన్‌బజార్, నవంబర్ 3 : ఉద్యోగుల సమస్యలపై సుధీర్ఘంగా పోరాడుతున్న ఏకైక సంఘం టీఎన్జీవో సంఘం అని సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ అన్నారు. గురువారం నాంపల్లిలోని జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా శాఖ పరిధిలోని వివిధ యూనిట్లలో ఉన్న దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టీఎన్జీవో స్పోర్ట్స్ మీట్లో ప్రతి ఉద్యోగి పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా 2023 డైరీ, క్యాలెండర్ విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్‌కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, కురాడి శ్రీనివాస్, ఉమర్ఖాన్, కార్యాలయ కార్యదర్శి ఎస్.మురళీరాజ్, మాజీ కార్యదర్శి దేవేందర్, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.