మలక్‌పేట/చాదర్‌ఘాట్, అక్టోబర్ 31 : ఆసరా పింఛన్లతో పేదలకు ప్రభుత్వం ఎంతో భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. సోమవారం చార్మినార్ తహసీల్ పరిధిలోని ఛావుని డివిజన్లోని 250 మంది లబ్ధిదారులకు ఎం.ఎన్. ఫంక్షన్ హాల్లో ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన వారికి దశలవారీగా పింఛన్ల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఎం.ఏ. సలాం షాహీద్, తాసీల్ అధికారులు రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన ..
ఛావునీ డివిజన్ పిల్లిగుడిసెలు డబుల్ బెడ్రూం ఇండ్లను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వివిధ విభాగాల అధికారులతో కలిసి డబుల్ బెడ్రూంల ప్రాం తంలో పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్‌బెడ్ రూంల ఏరియాలో చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు. అసంపూర్తిగా ఉన్న వాటి వివరాలను స్థానికులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికుల అవసరాలను బట్టి పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం.ఏ. సలాం షాహీద్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు సాయం చేయాలి..
దివ్యాంగులకు చేతనైన సాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఎమ్మెల్యే బలాల అన్నారు. సోమవారం పాత మలక్‌పేట డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీతో కలిసి మలక్‌పేటకు చెందిన ఇద్దరు దివ్యాంగులు మహ్మద్ తాజ్, నర్గిస్ ఫాతిమాలకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులను మానవతా ధృక్పథంతో ఆదుకోవాలన్నారు. మలక్‌పేట నియోజకవర్గంలోని దివ్యాంగులందరికీ బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీచేస్తామని తెలిపారు. దివ్యాంగులు సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు.