సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖానలు లక్ష్యానికి చేరువయ్యాయి. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. మొత్తం గ్రేటర్‌వ్యాప్తంగా 300 వైద్యశాలలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 262 చోట్ల వీటిని నెలకొల్పింది. ప్రతి 5 వేల నుంచి 10వేల జనాభాకు ఒకటి, జనాభా ఎక్కువగా ఉన్న డివిజన్లో రెండు వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నారు. రోజూ ఒక్కో కేంద్రం ద్వారా సుమారు 100 మందికి ఓపీ సేవలు అందిస్తున్నారు. 200 రకాల వైద్య సేవలను అందిస్తూ..144 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్యంపై భరోసా కల్పిస్తున్నారు. అనేక రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందుల పంపిణీతో బస్తీ ఆరోగ్యం మెరుగుపడుతున్నది. తాజాగా మరో 23 చోట్ల బస్తీ దవాఖానల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఐదు చోట్ల ప్రారంభానికి సిద్ధమవ్వగా, మరో ఐదు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఇదే సమయంలో 13 చోట్ల కమ్యూనిటీ హాల్స్లలోనూ నెలకొల్పాలని నిర్ణయించి..ఆ మేరకు పనులు చేపడుతున్నారు. విడతల వారీగా 23 చోట్ల అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ప్రారంభ దశకు దవాఖానలు
వీకర్ సెక్షన్ కమ్యూనిటీ హాల్ (బోరబండ-103(వార్డు)), తిలక్‌నగర్ కమ్యూనిటీ హాల్ (నల్లకుంట-81), హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ (మెహిదీపట్నం-70), ప్రేమ్‌నగర్/పటేల్ నగర్ ఖాళీ స్థలం ( అంబర్‌పేట-83), శ్రీనివాస నగర్ కమ్యూనిటీ హాల్ ( జగద్గిరిగుట్ట-126)లు ఉన్నాయి.
ఖాళీ స్థలాల్లో..
సులేమాన్ నగర్లో 150 గజాల ప్రభుత్వ స్థలం (సులేమాన్ నగర్-57), సులేమాన్ నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద జీహెచ్ఎంసీకి సంబంధించిన 130 గజాల స్థలం (సులేమాన్ నగర్-57), హసన్ నగర్ (శాస్త్రిపురం -58), శాస్త్రిపురం బస్టాప్ ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థలం (శాస్త్రిపురం-58), స్ట్రీట్ నంబరు -26 (వినాయక్ నగర్ -137)లు దవాఖానలు ఏర్పాటవుతున్నాయి.
కమ్యూనిటీ హాల్స్‌లో..
అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ ఎల్లారెడ్డి గూడ (సోమాజిగూడ-97), దాసారం బస్తీ కమ్యూనిటీ హాల్ (ఆమీర్‌పేట-98), ఎంసీహెచ్ క్వార్టర్స్ కమ్యూనిటీ హాల్ (అడ్డగుట్ట-142), దేవదాసుపుర కమ్యూనిటీ హాల్ (గోల్కొండ -67), నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ (తార్నాక-143), నేతాజీనగర్ కమ్యూనిటీ హాల్ (గన్‌ఫౌండ్రి-78), సుభాన్‌పుర కమ్యూనిటీ హాల్ (జాంబాగ్ -77), ఓల్డ్ ఇందిరానగర్ ( ఉప్పల్-10), మోడల్ మార్కెట్ బిల్డింగ్ హాల్ (సుభాష్‌నగర్ -130), మోడల్ మార్కెట్ జీహెచ్ఎంసీ బిల్డింగ్ ( జగద్గిరిగుట్ట -126), ప్రశాంత్‌నగర్ కమ్యూనిటీ హాల్ (మౌలాలి-138), మధురానగర్ కమ్యూనిటీ హాల్ (నేరెడ్మెట్ -136) , టీఎస్ఐఐసీకాలనీ మోడల్ మార్కెట్ బిల్డింగ్ (ఈస్ట్ ఆనంద్‌బాగ్-139) బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.