జవహర్‌నగర్,అక్టోబర్,26: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్ దాహం తీరింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బిందెడు నీళ్లకోసం మహిళల మధ్య పానిపట్టు యుద్ధాలే జరిగేవి. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో పల్లెలు, పట్టణాలకు ఇంటింటికీ తాగునీటి కనెక్షన్ ఇవ్వడంతో మహిళలు నీటి బిందెతో బటయకు వెళ్లే అవసరం లేకుండా పోయింది. జవహర్‌నగర్ కార్పొరేషన్లో 28 డివిజన్లలో మిషన్ భగీరథ పైపులైను పనులు పూర్తయి నల్లా కనెక్షన్న్లను ఉచితంగా అందజేశారు. రూ. 20కోట్లతో కార్పొరేషన్ అంతటా పైప్‌లైన్ పనులు శరవేగంగా జరిగాయి.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి నల్లా కనెక్షన్‌ను వెంటనే అందజేస్తున్నారు.
మిషన్ భగీరథ నీటిలో మాకు ఏండ్ల నాటి తాగునీటి కష్టాయి తీరాయి. గతంలో నీటికోసం ఇబ్బంది పడేవాళ్లం. అప్పటి పరిస్థితులను తలచుకుంటేనే దుఃఖం వస్తది. నీటి ట్యాంకర్ల వద్ద తాగునీటికోసం కొట్లాటలు జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్‌ను ఇవ్వడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్‌కు ఎప్పటికి రుణపడి ఉంటాం.
– సరోజ, గబ్బిలాల్పేట
అర్హులైన ప్రతి ఇంటికి ఉచితంగా నల్లా కనెక్షన్‌ను అందజేస్తాం. ఇప్పటికే కార్పొరేషన్లో 10500 వరకు నల్లా కనెక్షన్లను ఇచ్చాం. ఆలైన్లైన్లో దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో కరెంటు బిల్లు, ఇంటి పన్నులు, సంక్షేమ పథకాల పత్రాలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా నల్లా కనెక్షన్‌ను ఇస్తుంది.
-సాయినాథ్, హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్