దుండిగల్, అక్టోబర్ 26 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ భవనం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటుంది. సువిశాల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో నిర్మాణమవుతున్న ఈ భవనం సైబరాబాద్ కమిషనరేట్‌కే మోడల్‌గా మారనుంది. త్వరలో ఈ పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభం కానున్నది.
సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనే మోడల్‌గా రూపుదిద్దుకుంటున్న బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ను గండిమైసమ్మ-మియాపూర్ ప్రధాన రహదారిలోని ఊరగుట్టపై రెండు అంతస్తుల్లో నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు పూ ర్తికాగా ఫర్నిచర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనం లో మొత్తం రెండు అంతస్తులు ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్లో ఏడు గదులు, ఫస్ట్ ఫ్లోర్లో 9 గదులను నిర్మించారు. సు విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు ఖాళీ ప్రాంతంలో చిన్నపిల్లలు సైతం ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభు త్వం పరిపాలన సౌలభ్యం కోసం 2016లో పలు కొత్త జిల్లాలు, మండలాలతో పాటు పోలీస్స్టేషన్లను ఏర్పా టు చేసిన విషయం విదితమే. అందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో 11.10.2016న బాచుపల్లి చౌరస్తా సమీపంలోని ఓ అద్దె భవనంలో పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇరుకుగా ఉన్న సందులో పీఎస్ ఏర్పాటు చేయడంతో అటు పోలీ సు సిబ్బంది, ఇటు ఫిర్యాదు దారులకు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గండిమైసమ్మ-మియాపూర్ ప్రధాన రహదారికి ఆనుకుని, శివాలయం దారిలో ఊరగుట్టపై ఉన్న 1.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి కేటాయించారు.
కాగా.. అత్యాధునిక హంగులతో, సువిశాల ప్రాంగణంలో నిర్మాణమవుతున్న బాచుపల్లి పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి అరబిందో ఫార్మాస్యూటికల్ గ్రూపు సంస్థలు ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద రూ.3.5కోట్లతో భవనాన్ని నిర్మించిం ది. అయితే సంస్థ కేటాయించిన నిధులు నిర్మాణ పనులకు సరిపోవడంతో ఫర్నిచర్ వంటి పనులకు మరికొంత మంది దాతల నుంచి విరాళాలు సేకరించి పనులను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పనులన్నీ తుది దశకు చేరుకున్నా యి. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే పోలీస్‌స్టేషన్ నూతన భవనం ప్రారంభం కానుంది.