కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 23: తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం టీఆర్ఎస్ (బీఆర్ఎస్)తోనే సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పునరుద్ఘాటించారు. గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. బాలానగర్ డివిజన్ శ్రీశ్రీనగర్కు చెందిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కృష్ణ (కిట్టు)తోపాటు 150 మంది కాంగ్రెస్ నేతలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్లో చేరినట్లు కృష్ణ స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. టీఆర్ఎస్లో చేరినవారంతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.